*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి 

👉 మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారు భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం.

👉 భారతదేశం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, పాలన సజావుగా, సాఫీగా సాగడానికి బి.ఆర్.అంబేడ్కర్ రచించి, మనకు అందించిన రాజ్యాంగమే ప్రధాన కారణం.

👉 దళితులు, అణగారిన వర్గాలు, బలహీనవర్గాల ఉన్నతి కోసం జీవిత కాలం పోరాటం చేసి, తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బి.ఆర్ అంబేడ్కర్ గారు.

👉 అంబేడ్కర్ గారి ఆశయ సాధన కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిరంతరం శ్రమిస్తున్నారు.

👉 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంబేడ్కర్ గారి అడుగుజాడల్లో పయణిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ చరిత్ర సృష్టించారు.

👉 మహనీయుడు బి.ఆర్. అంబేడ్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమందరం కలిసి పని చేద్దాం.

👉 భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మహనీయుడు బి.ఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాం.