డా.బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో డా.బి. ఆర్. అంబేద్కర్  చిత్ర పటానికి  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ భారత దేశానికి దిశా దశ నిర్దేశం చేయడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో పాటు భారత రాజ్యాంగాన్ని రచించిన ఒక దిక్సూచిగా అంబేద్కర్ నిలిచి పోయాడు అని ప్రశంసించారు. అనంతరం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్  ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి గారు , వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు , ముత్తుకూరు మండల పార్టీ అద్యక్షులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.