నగరంలోని మినీబైపాస్ వద్ద  ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను, అలాగే  సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పరిశీలించి, జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, వేలూరు మహేష్, దేవిశెట్టి రాజగోపాల్, కోట శ్రీనివాసులు, నూనె మల్లికార్జున యాదవ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.