పంచాయతీ ఎన్నికలలో విజయభేరీ మోగించిన మంత్రి మేకపాటికి అభినందనలు తెలిపిన నెల్లూరు జిల్లా వైసీపీ లీగల్ సెల్


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఫిబ్రవరి, 14; గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని  


నెల్లూరు జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సిద్దాన సుబ్బారెడ్డి సహా న్యాయవాదుల బృందం కలిసి అభినందనలు తెలిపారు. 


గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున  కేటాయించిన న్యాయవాదుల పనితీరును మంత్రి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు. 


న్యాయపరమైన సలహాలిస్తూ అవాంతరాలను తొలగించడంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించిన 13 మంది బృందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేకంగా అభినందించారు. 


ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిన్నారెడ్డి, మనోహర్, విద్యాధర్ రెడ్డి, వంశీ రెడ్డి, సాయి రెడ్డి, కమలాకర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.