అమరావతి: ఏపీలో ఇకపై
ప్రభుత్వ మద్యం దుకాణాలు రాత్రి 9 వరకు తెరచే ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాత్రి 8 గంటల వరకే తెరిచేందుకు అనుమతి ఉండగా.. తాజాగా ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.