మద్యం సరఫరా పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు..

ఇతర రాష్ట్రాల నుండి మద్యం ని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది..

జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ; హైకోర్టులో దాఖలైన టువంటి వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పులో పేర్కొంది..

ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఉపశమనం కలిగినట్లు అయింది..