నెల్లూరు నగరంలోని స్థానిక తేదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఎం జగన్ పై నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ డైరెక్షన్ లో సీఎం జగన్ పనిచేస్తూ.. రాష్టాన్ని సర్వ నాశనం చేస్తున్నాడని ఏపీని మూడు ప్రాంతాలుగా విడగొట్టి ఏర్పాటు వాదానికి బీజం వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజల ముసుగులో వైసీపీ గుండాలే చంద్రబాబును అడ్డుకున్నారు. రాష్టానికి దశ దిశ చూపిన వ్యక్తిని మూడు గంటల పాటు వ్యాన్ లో కూర్చుని పెట్టి పోలీసులు నాటకం ఆడారు. పోలీసుల తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి లెక్కలు భవిష్యత్ లో సరి చేస్తాం. చంద్రబాబును అడ్డుకుంది విశాఖ వాసులు కాదు.. గుంటూరు, కడప నుంచి వచ్చిన వైసీపీ గుండాలే. ఫ్యాక్షన్ పాలన విశాఖకు వస్తుందనే అక్కడి వారు భయపడుతున్నారు. వైసీపీ చేసిన కోట్ల రూపాయల భూ కబ్జాలు బయటపడతాయనే చంద్రబాబును ప్లాన్ ప్రకారం అడ్డుకున్నారు. సీఎం జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. హైకోర్టు  మూడుసార్లు ప్రభుత్వానికి మొటిక్కాయలు జగన్ కు బుద్ది రావడం లేదు. చంద్రబాబు పర్యటనను ఎక్కడైనా అడ్డుకుంటే టీడీపీ  కూడా ప్రతిఘటిస్తుంది. విజయసాయిరెడ్డి శకుని రాజకీయాలు చేస్తూ రాష్టాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.