నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : వైసీపీలో కొత్తగా చేరిన మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు శనివారం సాయంత్రం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు .పార్టీలో చేరిన తర్వాత మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన ఎంపీ తో కాసేపు ఉల్లాసంగా గడిపారు. జిల్లా విశేషాలను కాసేపు మాట్లాడుకున్నారు. ఆయనతోపాటు ఏఎంసీ మాజీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆనం విజయకుమార్రెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా కాసేపు ఆయనతో మాటామంతీ జరిపారు.