నెల్లటూరు నుండి తిప్పవరప్పాడు రోడ్లు గుంతలు ఎక్కువగా ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడడం వలన తక్షణమే రోడ్లను మరమ్మతులు చేపట్టి  శాశ్వత పరిష్కారానికి మరియు గూడూరు నుండి తిప్పవరప్పాడు జంక్షన్ వరకు సిసి రోడ్ల అంచనాలు తయారు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వర ప్రసాద రావు గారు..,

 అనంతరం చెన్నూరు రామలింగాపురం రోడ్డు పశ్చిమ వైపు పొలాలు నీట మునిగినందు వలన రోడ్డు తూర్పు వైపుగా వర్షపు నీరు పంట పొలాల్లో ఆగకుండా పోవడానికి ఏర్పాటు చేస్తూ దాని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా శాశ్వత ప్రాతిపదికన రోడ్డును కాంచన తయారుచేయవలసిందిగా అధికారులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే గారు..,

 చెన్నూరు లోని కలూజు వాగు సర్వే చేసి రోడ్డుకి కాల్వర్ట్ నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి వైస్సార్సీపి పార్టీ నాయకులు రాజారెడ్డి, మనుబోలు సతీష్ రెడ్డి,జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి, వేణు రెడ్డి, మహేంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాబు రెడ్డి, బాలకృష్ణ రెడ్డి మరియు రైతులు ఉన్నారు.