ఒత్తిడికి గురి కాకుండా శిక్షణను ఆనందంగా ముగించండి - యస్పి 
సిసిటిఎన్‌ఎస్ పై పూర్తి అవగాహన ఏర్పరుచుకోండి, స్టేషన్ లో ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలి 
శిక్షణకు హాజరైన 130 మంది శిక్షణార్ధులు
నెల్లూరు, పిబ్రవరి 10, (రవికిరణాలు) : జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు 5వ బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల(మహిళా పోలీసు అధికారులు) 2 వారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ డిటిసి వైస్ ప్రిన్సిపాల్ డిఎస్పి(ఎఆర్) రవీంద్ర రెడ్డి, ప్రొబేషనరి డిఎస్పి షేక్.షాను సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా యస్పి మాట్లాడుతూ డిటిసి లో ముందు జరిగిన 4 బ్యాచ్‌లలో మంచి ఫలితాలతో స్టేట్ లోనే టాప్‌ లో నిలిచిందని, ఎంతో ఉన్నత విద్యార్హతలు కలిగిన మీరు ఈ ఉద్యోగాలు పొందటం అభినందనీయమని, స్పందన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకోవాలి, స్టేషన్‌లలో ఉన్న ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలని, సిసిటిఎన్‌ఎస్‌ వంటి వాటిపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని, ఇంక మీరంతా మస్తీలో ఉన్న మహిళా 
పోలీసులని, మీ మీద మీరు పూర్తి విశ్వాసం కలిగి, ఎలాంటి టెన్షన్ పడకుండా, ఇది కూడా మీ ఇల్లు లాగే భావించి శిక్షణ విజయవంతంగా ముగించాలని తెలిపారు. అంతేకాకుండా శిక్షణలో భాగంగా శాంతి భద్రతలు, మహిళలు, బాలలు, వృద్ధులపై జరిగే హింస, లైంగిక వేదింపులు, దాడులు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి వారికి రక్షణ, భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు ఒక మిషన్ మోడ్ లో అందరూ సేవలు అందించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా శిక్షణార్ధులకు సందేశాన్ని అందిస్తూ, శిక్షణ సమయంలో గానీ, తరువాత ఎప్పుడైనా ఎలాంటి సమస్యలున్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా  శిక్షణార్ధులకు మనో ధైర్యం, భరోసా కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిటిసి డిఎస్పి రవీంద్ర రెడ్డి కో ఆర్డినేట్ చేస్తూ ఈ రోజు మొత్తం 130 మంది అభ్యర్ధులు 5వ బ్యాచ్ శిక్షణకు రిపోర్ట్ చేసుకోవడం జరిగిందని, ముందు బ్యాచ్ శిక్షణార్ధులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరాటే, యోగాలకు సంబంధించి థీయరీ క్లాసులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రొబేషనరి డిఎస్పి షేక్.షాను మాట్లాడుతూ మీరు సత్పవర్తనతో రోల్ మోడల్ గా 
ఉండాలని, పోలీస్ ఇమేజ్ ని మీరు పెంచాలని పోలీసు చట్టలపై అవగాహన పెంచుకోవాలని, మహిళలకు అన్యాయం జరిగితే చేయవలసిన చర్యల గురించి శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పై అధికారులతో పాటు డిటిసి-ఆర్‌ఐ డి.సురేష్, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.