నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : “మూర్చకు మోక్షం" అనే నినాదంతో మూర్చవ్యాధికి ఆధునిక శస్త్రచికిత్సలను అందుబాటులోనికి తీసుకుని వచ్చి, ఒకే సంవత్సరంలో దేశంలోనే అత్యధిక, విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించిన హాస్పిటల్ గా నారాయణ హాస్పిటల్ ప్రత్యేక ఘనతను సాధించింది. మూర్ఛవ్యాధిగ్రస్తులు చాలా మంది సమాజంలో స్వేచ్చగా తిరగలేక, మానసికంగా కృంగిపోతుంటారు. కారణం ముర్చవ్యాధి సమయం, సందర్భం ముందస్తు హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా వస్తుంది. మూర్చవ్యాధి గ్రస్తులకు వివాహం చేయాలన్నా, ఉన్నత చదువులు చదవాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, చేయలేక సమాజంలో మానసిక వికలాంగులుగా మిగిలిపోతుంటారు. క్రమం తప్పకుండా మందులు వాడటం కూడా కొంత మందికి ఆర్థిక భారం వలన వీలు కాక మరణాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను సమూలంగా రూపుమాపి, సరికొత్త వైద్య విధానంతో నారాయణ న్యూరో సైన్సెస్ విభాగం శ్రీకారం చుట్టింది.నారాయణ న్యూరాలజి విభాగాధిపతి డాక్టర్‌ ఎన్.ఎస్. సంపత్ కుమార్ నేతృత్వంలో ఎపిలెప్సీ స్పెషలిస్ట్ డాక్టర్‌ 
రావిష్ కెన్ని రాజీవ్, న్యూరోసర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో నారాయణ హాస్పిటల్ లో మాత్రమే అందుబాటులో గల 64 ఛానల్ వీడియో ఇ.ఇ.జి, 3 టెస్లా ఎమ్మారై, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక యంత్ర పరికరాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ల సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. ఈ శస్త్రచికిత్సల కోసం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 300 మందికి పైగా మూర్చవ్యాధిగ్రస్తులు వైద్య చికిత్సల కోసం రాగా వారందరికి ఎమ్మారై వంటి ఖరీదైన పరీక్షలతోపాటు సుమారు రూ.16,000 పైగా విలువైన వైద్య పరీక్షలు, సేవలు ఉచితంగా అందించడం జరిగింది. ఈ 300 మందిలో 42 మందికి శస్త్రచికిత్సలు అవసరమని డాక్టర్‌ సంపత్ కుమార్ బృందం నిర్ధారించింది. అందులో ఇప్పటి వరకూ 11మంది పురుషులు, 10 మంది మహిళలు మొత్తం 21 మందికి డా॥ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 100 శాతం విజయవంతమయ్యేలా కృషిచేశారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో 14-48 సం||ల మధ్య వయస్సు కలిగిన వారు ఉండడం గమనార్హం.ఈ అంతర్జాతీయ మూర్చదినం మూర్చవ్యాధిగ్రస్తులందరికీ ఒక శుభదినంగా భావించవచ్చు. శస్త్రచికిత్స చేయించుకున్న అందరూ కూడా సాధారణ జీవితం గడుపుతూ తమతమ కుడుంబాలలో ఆరోగ్య వెలుతురులు 
నింపారు. నారాయణ న్యూరోసైన్సెస్ విభాగంలోని ఈ ఎపిలెప్సీ బృందం, పరికరాల సహకారంతో మూర్ఛరహిత సమాజం కోసం కృషిచేసి ఆరోగ్యకరమైన స్వతంత్ర జీవితాలు మూర్ఛరోగులు గడిపేందుకు కృషిచేస్తుంది. మూర్ఛవ్యాధి పై ప్రజలకు అవగాహన కలిగించి 80% కు పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులను మందులతోనే నయంచేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నారాయణ న్యూరోసైన్సెస్ విభాగం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుందని డా ఎన్.ఎస్. సంపత్ కుమార్ తెలిపారు.