నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.శాంతినగర్ కు  చెందిన రామయ్య అనే వృద్దుడు రోడ్డు దాటుతుండగా అటుగా వేగంగా వస్తున్న "సేఫ్ ఎన్విరాన్ " వాహనం ఢీ కొంది.ఈ ప్రమాదంలో వృద్దుని తలకి తీవ్ర గాయమైంది.
   అదే సమయంలో అటుగా వెళ్తున్న నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హుటాహుటిన క్షతగాత్రుని వద్దకు స్వతహాగా వైద్యులు కావటం మూలాన గాయాన్ని పరిశీలించి తక్షణమే నరసరావుపేట వైద్యశాలకు తరలించవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు.