అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని గార్మెంట్‌ పరిశ్రమలలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పరిశ్రమ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో మహిళా కార్మికులు బైఠాయించారు. వారిని అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన సీఐటీయూ నాయకులను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కార్మికులను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీసు వాహనాలకు మహిళలు అడ్డుపడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.