గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ
ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు సమక్షంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు సిబిఎన్ ఆర్మీ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు మాజీ తెలుగుదేశం జిల్లా కార్యదర్శి కొత్తమాసు వెంకట మల్లికార్జున రావు ప్రముఖ వ్యాపారవేత్త జవ్వాది మల్లికార్జున రావు  కొత్తమాసు రామకృష్ణ  కొత్తమాసు ప్రకాష్ ఈరోజు చంద్రమౌళి నగర్ లోని గుంటూరు జిల్లా పార్లమెంట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ సందర్భంగా రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ గారు గత 6సంవత్సరాలలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఈసంవత్సర కాలంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అదేవిధంగా దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని నమ్మి పార్టీలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కొత్తమాసు వెంకట మల్లికార్జునరావు మరియు వారి మిత్రులు 20మందిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఈసందర్భంగా తెలిపారు ఈకార్యక్రమంలో టివి రావు,రాచమల్లు భాస్కర్,రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు....