నెల్లూరు, జనవరి 21, (రవికిరణాలు) : ఓటర్లు జాబితా సవరణలకు సంబంధించి  నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు శ్రీకాంత్ లాల్ దండే ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పక్షాల సమావేశంలో ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న తప్పులను సరిదిద్దాలని కోరుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్‌ పరిశీలకునికి వినతిపత్రంను అందజేశారు.