నూతనంగా నెల్లూరుజిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కెవిఎన్ చక్రధర్ బాబును సోమవారం ఉదయం విజయ డైరీ చైర్మన్  కొండ్రెడ్డి రంగారెడ్డి , ఎం డి కృష్ణమోహన్ గారు, మాజీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ ,
మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరులోని జడ్పీ ఆఫీస్  లో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యి పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు కలెక్టర్ తో చర్చించారు.