నెల్లూరుజిల్లా.  సూళ్లూరుపేట:-

పట్టణంలో విశ్వహిందూ పరిషత్ అద్వర్యం లో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించారు, స్థానిక సత్య సాయి మందిరం లో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు జరిగాయి, ఆరు విభాగాలుగా ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు, అలాగే పోటీ లో పాల్గొన్న వారికీ కూడా సర్టిఫికెట్లు అందించారు, పట్టణం లోని 15 పాఠశాలలకు  చెందిన 800 విద్యార్థులు ఈ పోటీల్లో  పాల్గొన్నారు,భగవద్గీత ఎక్కడుంటే భగవంతుడు అక్కడే, భగవద్గీత శిక్షణ మీ కుటుంబానికి రక్షణ  అనే నినాదం తో ఈ  పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కమ్మి రెడ్డి ,  బజరంగ్ దళ్ వినిత్ , రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.