వెంకటాచలం మండల పరిధిలోనికసుమూరు గ్రామ సచివాలయానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా అక్కడ సిబ్బంది సచివాలయ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంతో వారి పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.. అర్హత కలిగిన పేద ప్రజలకు సంక్షేమ పథకాలను త్వరితగతిన అందజేయాలన్న లక్ష్యంతో సచివాలయంలో ఏర్పాటు చేశారని  అంకితభావంతో విధి నిర్వహణ  చేయాలన్నారు... పని తీరు మారకుంటే వేటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎంపీడీవో హేమలత , వెంకటాచలం సిడిపిఓ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు