సోము వీర్రాజుకు శుబాకాంక్షలు తెలిపిన రామిశెట్టి
--------------------------------------
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడుగా ఎన్నికైన సోము వీర్రాజు కు రామిశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ చైర్మన్ రామిశెట్టి వెంకట సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయనను కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికలలో జనసేన-బిజెపి సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. సోము వీర్రాజు, రామిశెట్టి వెంకట సుబ్బారావు ఒకే సామజిక వర్గం కావడం, ఎప్పటి నుండో పరిచయం ఉండటంతో రామిశెట్టి కూడా బిజెపిలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వీర్రాజును కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. రామిశెట్టి లాంటి బలమైన నాయకుడు బిజెపిలో చేరితే కావలి నియోజకవర్గంలో బిజెపి బలపడటం కాయం. గత ఎన్నికలలో జనసేన బలోపేతానికి తీవ్రంగా కృషి చేసి సీటు విషయంలో భంగపాటుకు గురైన రామిశెట్టి అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ తన ట్రస్ట్ ద్వారా అనేకమందికి సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ ఆదుకుంటూ మంచి మనసున్న వ్యక్తిగా రామిశెట్టికి నియోజకవర్గంలో మంచి పేరుంది.