నెల్లూరు కార్పొరేషన్ లో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ కాసేపటి క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిశారు.... నెల్లూరు పట్టణంలోని డైకాస్ రోడ్డు మంత్రి క్యాంపు కార్యాలయంకు ఎం హెచ్ ఓ వెళ్లారు... మేకపాటి కూడా మనసులో ఏం పెట్టుకోకుండా ఎం హెచ్ ఓ వెంకటరమణను పలకరించారు... నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యంను మరింత మెరుగుపరిచేందుకు శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు... అధికారులకు సంబంధించి వారి పనితీరు పై మంత్రి మేకపాటి కలెక్టర్ కు లేఖ రాయటం అత్యంత అరుదు.. ఇది పత్రికలకు ఎక్కడంతో కాస్త వివాదాస్పదమైంది.. తాజా ఘటనతో మొత్తానికి కార్పొరేషన్ ఎం హెచ్ ఓ వెంకటరమణ బదిలీ ఆగిపోయినట్టే...