ముంచేస్తున్నరు మార్పు కోరుకోండి.... పనబాక లక్ష్మి


.......... ......... .......


సైదాపురం  న్యూస్...


పార్టీ ఆదేశాల మేరకు టిడిపి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ అగ్ర శ్రేణుల నడుమ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం జోరందుకుంది.


రాష్ట్రం మొత్తం లో ఉన్న టీడీపీ అగ్ర నాయకులు తిరుపతి పార్లమెంటు వైపు టీడీపీ గెలుపు కొరకు

కదిలివస్తున్నరు.


వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం చుట్టుపక్కల గ్రామాలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం సాగింది. 


సైదాపురం మండలం లో అనేక ప్రాంతాల్లో పనబాక లక్ష్మి ప్రచార రోడ్ షో సాగింది ఈ రోడ్ షో లో రాష్ట్ర నాయకులు 

పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు , గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పర్వతనేని  శ్రీనివాసరావు, రాజోలు నియోజకవర్గ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, తదితరులతో ముమ్మరంగా కోన సాగుతున్న ప్రచారంలోకి. ప్రజలు బారి సంఖ్యలో చేరుకుని నాయకుల ప్రసంగాలను వింటూ ఆలోచనలలో పడుతున్నారని గ్రహించాలి.


అభ్యర్ధి పనబాక లక్ష్మి ప్రసంగం


విస్తృత ప్రచారం లో ఊరూరా తిరుగుతున్న నాకు అనేక ప్రాంతాల్లో ప్రజలు పెరుగుతున్న ధరలను అదుపు చేయలేని వైసీపీ ప్రభుత్వం  పై ప్రజలు విరుసుకు పడుతున్నారని మాట్లాడారు రాబోవు రోజుల్లో ప్రజలకూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని తానై ఉంటాడని తెలుగు దేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఆమె కోరారు.