వేముల పాడు ఘటనలో 13  మంది అరెస్టు

______________

జలదంకి మండలం వేములపాడు ఘర్షణ  ఘటనలో పోతల రమణయ్య తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో నిందితులైన 13 మందిని సోమవారం చామదల క్రాస్  వద్ద జలదంకి యస్ ఐ వెంకట్రావు అరెస్టు చేసినట్లు డి.యస్.పి ప్రసాద్, సి.ఐ అక్కేశ్వరరావు తెలిపారు.అరెస్టు అయిన వారిలో బద్దిపూడి తిరుపాలు,చేవూరి నాగార్జున, సుబ్రహ్మణ్యం, కూసుపాటి ఏసేబు,మొద్దు అంజయ్య, మొద్దు జయరామయ్య,మొద్దు లక్ష్మయ్య,మొద్దు రామయ్య,మొద్దు రామకృష్ణ,మొద్దు రాంబాబు,పోతల రవిబాబు,పోతల శ్రీ ను, పోతల వెంకటేష్ లు ఉన్నట్లు డి యస్ పి తెలిపారు. యస్ ఐ వెంకట్రావు సమయస్ఫూర్తి తో ప్రమాద తీవ్రత నెలకొందని, సి.ఐ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రశాంత త నెలకొల్పినట్లు తెలిపారు. రమణయ్య వర్గానికి చెందిన నలుగురు ఆసుపత్రి లో ఉన్నా రని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డి యస్ పి ప్రసాద్ వివరించారు @ జయప్రతాప్ రెడ్డి