గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వెలగపల్లి విస్తృతంగా పర్యటన 


 నివర్ తుఫాను బాధితులను పరామర్శ 


 దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే 


 నివర్ తుఫాను బాధితులకు న్యాయం చేస్తాం 


  ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు హామీ


 నివర్ తుఫాను ప్రభావంతో  ఈ నెల 26 నుండి కురిసిన వర్షాలకు గూడూరు నియోజకవర్గ పరిధిలో  ఉన్న 5 మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దింతో ఎన్నో ఇల్లులు దెబ్బతిన్నాయి,ఎన్నో ఇళ్లల్లో కి నీళ్లు వచ్చి పలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రతి నియోజకవర్గంలో  దెబ్బతిన్న పంటల వివరాలు, నష్టాలు వివరాలు సేకరించాలి అనీ ఆదేశాలు రావడంతో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు 4 రోజుల నుండి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నారు, ప్రతీ రోజు  ఉదయం నుండి రాత్రి వరకూ వైసీపీ నేతలు, అధికార యంత్రాంగం తో కలిసి పర్యటిస్తూ   అందరిని ఆశ్చర్య చకితులను చేస్తున్నారు, 


 "విస్తృతంగా ఎమ్మెల్యే పర్యటన వివరాలు"  నెలటూరు:గూడూరు మున్సిపల్ పరిధిలోని నేలటూరు సమీపంలోని మర్రిపాల మడుగును ఆదివారం గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్  వెలగపల్లి వరప్రసాద రావు పరిశీలించి అక్కడ రైతులు సమస్యలుతెలుసుకున్నారుఎమ్మెల్యే  వెంట ఇరిగేషన్ అధికారులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి, కొండూరు సునీల్ రెడ్డి తదితరులు నాయకులు ఉన్నారు..,గూడూరుపట్టణం:గూడూరు సొసైటీ ప్రాంతంలో వాకింగ్ చేస్తు శాసనసభ్యులు డాక్టర్  వెలగపల్లి వరప్రసాద రావు అక్కడ ఉన్న చిరు వ్యాపారులు ను కలిసి వారికి జగనన్న తోడు రుణం అందిందా లేదా అని విచారణ చేశారు గూడూరుపట్టణం:గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందినటువంటి ఓ మహిళ తన జీవన ఉపాధి చాలా కష్టతరంగా మారింది అని ప్రభుత్వం నుండి బ్యాంకు లోను ఇప్పించ వలసిందిగా ఎమ్మెల్యే ని కోరగా బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి తప్పకుండా వారికి న్యాయం చేసి ఆదుకుంటామని ఆ మహిళకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.


గూడూరు సొసైటీ ప్రాంతంలో ఒక వికలాంగునికి బ్యాంకు ద్వారా అతనికి రుణాన్ని మంజూరు చేసిన ఎమ్మెల్యే కి ఆ వికలాంగుడు బ్యాంకు రుణం ద్వారా 'అరటి పండ్లు' వ్యాపారం చేసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నానని వాకింగ్ చేస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు..,వేముల పాళెం: గూడూరు మున్సిపల్ పరిధిలోని వేముల పాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయినా రైతుల పొలాలను పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు.


విందూరు: గూడూరు రూరల్ పరిధిలోని విందూరు చెరువును పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్  వెలగపల్లి వరప్రసాద రావు,

అనంతరం గ్రామంలోని తుఫాన్ ప్రభావం వల్ల వంద ఎకరాల పైన నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వం ద్వారా గ్రామ రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గూడూరు రూరల్ పరిధిలోని విందూరు నుండి చెన్నూరు కి వెళ్ళు రోడ్డు మార్గం తుఫాన్ ప్రభావం వలన దాదాపు 400 మీటర్లు వరకు రోడ్డు వరద ప్రవాహాన్ని కి తెగి  పోవడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద పరిశీలించారుఅనంతరం గ్రామంలోని తుఫాన్ ప్రభావం వల్ల వంద ఎకరాల పైన నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన  ప్రభుత్వం ద్వారా గ్రామ రైతుల కోసంనష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈయన వెంట వైసీపీ నేతలు, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.


 మిట్టత్మకూరు : గూడూరు రూరల్ పరిధిలోని మిట్టత్మకూరు గ్రామంలోని నాగుల గుంట చెరువును ఎమ్మెల్యే  పరిశీలించారు, అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ,    గ్రామంలో ని ప్రజలు తమకు ప్రభుత్వం నుండి ఇస్తున్న రేషన్ బియ్యంను డిల్లర్ షాపుకు వచ్చి ఐదు రోజులు అయినా డిల్లర్లు ఇవ్వడంలేదు అని అడిగితే  కరెంటులేదని, సిగ్నల్స్ లేవని ఫింగర్ ప్రింట్ పడడంలేదంటూ (ఎలక్ట్రికల్ మిషన్లు పనిచేయడం లేదు అని) దాని వలన ఇవ్వలేక పోతునము అంటున్నారు వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు, తుఫాన్ ప్రభావంతో గ్రామంలోని  గ్రామస్థులు  ఇబ్బందులు పడుతున్నాం అని తెలుపగా వెంటనే జిల్లా కలెక్టర్ తో  ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి మ్యాన్యువల్ గా ఐనా వరద ప్రభావం ఉన్న గ్రామంలోని గ్రామస్థులకు రేషన్ బియ్యం ఇవ్వాలని కోరగా,వెంటనే స్పందించిన కలెక్టర్  గ్రామంలోని ప్రజలకు మ్యాన్యువల్ గా రేషన్ బియ్యం ఇస్తామని ఫోన్ లో చెప్పడం జరిగింది.   ఎమ్మెల్యే  వెంట వైస్సార్సీపి పార్టీ నాయకులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..,రామలింగపురం: గూడూరు రూరల్ పరిధిలోని రామలింగాపురం  తుఫాన్ ప్రభావం వలన గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిధిలావస్థకు గురికాగా శాసనసభ్యులు డాక్టర్  వెలగపల్లి వరప్రసాద రావు పరిశీలించారు,నాడు - నేడు పథకం కింద పాఠశాల మరమ్మతులకు నిధులను మంజూరు చేపిస్తాను గ్రామంలోని ప్రజలకు  ఎమ్మెల్యే హామీ ఇచ్చారు,     ఎమ్మెల్యే  వెంట ప్రభుత్వ అధికారులు వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి,కొండూరు సునీల్ రెడ్డి,వెడిచెర్ల బాబు రెడ్డి,జనార్దన్ రెడ్డి, డేగపూడి కృష్ణా రెడ్డి,దామోదర్ రెడ్డి,అట్ల శ్రీనివాస్ రెడ్డి,రమణారెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రమోహన్, శ్రీహరి నాయుడు, సుబ్బానాయుడు, నాగిరెడ్డి మరియు గ్రామ రైతులు ఉన్నారు.తిప్పారపాడు :గూడూరు రూరల్ పరిధిలోని తిప్పరపాడు బేరివాక  మడుగును ఎమ్మెల్యే  పరిశీలించారు,అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే  వెంట ప్రభుత్వ అధికారులు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి,మేడనూరు శ్రీనివాసులురెడ్డి, కొండూరు సునీల్ రెడ్డి,డేగపూడి కృష్ణారెడ్డి,కృష్ణయ్య యాదవ్,జనార్దన్ రెడ్డి, వేణు రెడ్డి, పవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, హరి బాబు రెడ్డి, రమణారెడ్డి మరియు గ్రామ రైతులు ఉన్నారు.