నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 12వ డివిజన్ వావిలేటిపాడు, బి.సి. కాలనీకి చెందిన బండ్ల తులసీరామ్, జానా హరికృష్ణ గౌడ్, జానా శ్రీనివాసులు గౌడ్ వారి మిత్రబృందంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

 పార్టీలో చేరినవారికి సముచితస్థానం మరియు తగిన గుర్తింపును ఇస్తాం అలాగే ప్రజలసంక్షేమం, అభివృద్ధి ఎంత ముఖ్యమో, కార్యకర్తల సంక్షేమం నాకు అంతే ముఖ్యం.  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది. ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.