శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్  జ్వరాలు, అంటువ్యాధులపై - డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వాలంటీర్లు, ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.


👉 జ్వరాల సీజన్ మొదలైనందున ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.


👉 పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలి.


👉 గ్రామీణ నీటి సరఫరా అధికారులు సైడ్ డ్రైన్లు పొర్లకుండా,  గ్రామాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా పంచాయతీ సిబ్బందికి సూచనలు ఇవ్వాలి.


👉 అధికారులు సమన్వయంతో పనిచేసి దోమలను నిర్మూలించి, ప్రజలు జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


👉 గ్రామ స్థాయి సిబ్బంది గ్రామాలలో ప్రతి ఇంటిని పరిశీలిస్తూ, దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి.


👉 డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాల బారినపడే వారికి తక్షణ చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి.


👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2434 వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు.


👉 ఆరోగ్యశ్రీ ద్వారా జ్వరాలు నయం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెసలుబాటు కల్పించారు.


👉 విష జ్వరాల బారిన పడి లక్షలు వెచ్చించవలసి వస్తున్న పేద, బడుగు వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చడం ఎంతో ఉపకరిస్తుంది.


👉 కరోనా మూడో విడత సంకేతాల నేపథ్యంలో అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి.


👉కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి 100 శాతం లక్ష్యాన్ని ఛేదించాలి.


👉 అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోండి.