మేధావుల సమావేశాన్ని నిర్వహించిన బిజేపి

తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా బిజెపి ఎంపి అభ్యర్థిని గెలిపించాలని నాయుడుపేట పట్టణంలో కేకే కళ్యాణ మండపం వద్ద  ఆదివారం బిజెపి నాయకులు మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర దుబ్బాక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జనసేన పార్టీ నాయకులు వుయ్యాల ప్రవీణ్ కుమార్, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి , తదితురులు హాజరయ్యారు..