పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వాకాడు సర్కిల్ పోలీసుశాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ రావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం (రన్‌ ఫర్‌ యూనిటీ) ఐక్యతా పరుగు నిర్వహించారు. కార్యక్రమాన్ని సిఐ నరసింహ రావు జెండా ఊపి ప్రారంభించారు. పరుగు పోలీస్‌ విద్యానగర్ హెచ్ పి పెట్రోల్ బంక్  నుంచి ఎన్ బి కె ఆర్  కళాశాల మీదుగా  గాంధీ బొమ్మ సర్కిల్‌ మీదుగా, కోట క్రాస్ రోడ్డు సర్కిల్‌, కోట పోలీసు స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా  సి ఐ నరసింహరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో తీవ్రవాదులతో పోరాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్మరణార్ధం ఐక్యతా పరుగు నిర్వహించామని తెలిపారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో పోలీసులు చేసిన త్యాగాలను, వారి కఠినమైన విధులు, ఆయుధాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.