మహిళా కమీషన్ సిరియస్ యాక్షన్

నెల్లూరు  లోని టూరిజమ్ డివిజను కర్యాలయానికి చేరుకొని అధికారి దాడికి గురైన బాధిత మహిళను పరామర్శించి మహిళా కమీషను వాసిరెడ్డి పద్మ


బాధిత ద్యోగిని, సహ ఉద్యోగుల నుంచి ఘటన పూర్వాపరాలను తెలుసుకొన్న వాసిరెడ్డి పద్మ

మహిళాలకు కమీషన్ అండగా ఉంటుంది, టూరిజమ్ కార్యాలయం ఘటనలో అమానుషంగా ప్రవర్తించి అధికారిని విదుల నుంచి తొలగించి, కఠినమై కేసు నమోదు చేశారని వెల్లడి

చార్జిషీట్ తక్కు వ్యవధిలో సిద్దంచేయాల్సిందిగా కమీషను నుంచి పోలీసులకు సూచించాము

మహిళ ఉద్యోగి పై అధికారి దాడికి పాల్పడిన  ఘటనలో  బాధిత వికలాంగ మహిళను రాష్ట్రమహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ నెల్లూరులోని పర్యాటక డివిజను కార్యాలయానికి వెళ్లి పరామర్శించారు.

ఉద్యోగిని పై విచక్షణా రహితంగా దాడి చేసి అమానుషంగా  ప్రవర్తించిన డిప్యూటి మేనేజరు భాస్కర్ రావును  ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలగించి చర్యలను చేపట్టిందన్నారు. 

అరెస్ట్ చేయడంతోపాటు వారం రోజుల్లో చార్జిషీట్ సిద్దం చేసేవిధంగా పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయన్నారు.

ఇంత అమానుషం గా వ్యవహరించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్  పై కఠిన చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఈ ఘటన పైసహఉద్యోగులు  కేసు పెట్టడానికి సహకరించకపోవడం పై విచారణకు ఆదేశించామన్నారు.

బాధితులకు న్యాయం జరిగే వరకూ మహిళా కమిషన్ అండగా ఉంటుంది వాసిరెడ్డి పద్మ విలేకరులకు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు పూర్తి భద్రత ఉంటుందని అన్యాయానికి గురైన వారు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.