శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం వంశపారంపర్య  ధర్మకర్త గా సుమన్.తేజా.రెడ్డి

నెల్లూరు సెప్టెంబర్ 23 : నెల్లూరు నగరంలో వేంచేసివున్న శ్రీ వేణుగోపాలస్వామి  దేవస్థానం వంశపార పర్య ధర్మకర్త గా శ్రీ తుమ్మల సుమన్ తేజా రెడ్డి గురువారం ఉదయం 11.50 నిమిషాల కు దేవస్థానం కార్యాలయంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖా అసిస్టెంట్ కమిషనర్ మరియూ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.దేవస్థానం అర్చకులు సుమన్ తేజా రెడ్డిని ఆశీర్వ వచనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు,దేవస్థానం సిబ్బంది, సుమన్ తేజా రెడ్డి కి అభినందనలు తెలియజేశారు.