యూపీఎస్‌సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 4వ తేదీన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి 9.30గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు సిటీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వరకు ఈ బస్సులు నడుస్తాయన్నారు. ముఖ్యమైన బస్‌ స్టాపుల్లో అభ్యర్థులకు అవసరమైన బస్సుల సమాచారం తెలియజేసేందుకు సూపర్‌ వైజర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.