నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పిలుపునిచ్చారు.  కరోన సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తుండడంతో నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వయంగా జిల్లా ఎస్పీ వాహనదారులకు మాస్కులు తొడిగారు. ఇంట్లో నుండి  బయటికి వచ్చేటప్పుడు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు