నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డా'బి.ఆర్. అంబెడ్కర్ 130వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ప్రధాన కూడలి అయిన వి.ఆర్. సి.సెంటర్లో  ఉన్న అంబెడ్కర్ కి పులమలతో నివాళులు అర్పించండం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పి.టోనిబాబు మాట్లాడుతూ ఎందరో మహనీయులను ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టి సిద్దాంతాలతో పార్టీ ఏర్పాటు జరిగింది.కులాల ప్రస్తావన లేని రాజకీయ మార్పు రావాలి అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ అడుగు జడలలో ముందుకు వెళ్లడం జరుగుతుంది అని తెలియజేసారు. పీడిత బ్రతుకుల్లో ఆశాజ్యోతి నింపిన మహనీయులు అంబెడ్కర్ ప్రజలకు స్వేచ్ఛ హక్కులను  కల్పించిన మహా నేత అని తెలియజేసారు.నేటి యువత రాజ్యాంగం పట్ల మంచి అవగాహన కలిగి కొత్త తరం రాజకీయ ప్రస్థానంలో వారి కృషిని పుణికి పుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షేక్.షన్ వాజ్ .షఫీ,  సుబ్బు, సుధాకర్  పాల్గొన్నారు.