చిట్టమూరు, జనవరి 10, (రవికిరణాలు) : చిట్టమూరు మండలంలోని పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డి వాగులో గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు సచివాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ద్వారా అందే సేవల గురించి వివరించి అర్హులు పేదలకు గ్రామ సచివాలయం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యాలయంలో శాఖల వారీగా నిర్మింపబడ్డ ఉద్యోగులతో వారి వారి సేవల గురించి వివరించారు. జగన్మోహన్ రెడ్డి వైసిపి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిత్యం ప్రజా సంక్షేమం పై పనిచేస్తున్న వైసీపీ కి స్థానిక ఎన్నికల్లో మద్దతు తెలిపి అన్ని స్థానాలు  దక్కేలా అందరూ అండగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, ఎమ్మార్వో రవికుమార్, మండల పార్టీ కన్వీనర్ సన్నరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నాయకులు, మధుసూదన్ రెడ్డి, మధు యాదవ్, కస్తూర్ రెడ్డి"ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.