"కాకాణికి ఘన స్వాగతం పలికిన విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు" 


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో  ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో పర్యటించి, పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

ఎమ్మెల్యే కాకాణికి ఘన స్వాగతం పలికిన విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఆట, పాటలతో అలరించిన చిన్నారుల నృత్యాలు

 జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్కూళ్లు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. కరోనా సమయంలో పిల్లలకు కరోనా వ్యాప్తి చెందకుండా, పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, పిల్లలు అందరూ పాసైనట్లుగా ప్రకటించారు. విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడంతో, అలసత్వం ప్రదర్శించకుండా, కష్టపడి చదవడం అలవర్చుకోవాలి. విద్యార్థులు కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం కాకుండా, తమ లక్ష్యాన్ని సాధించడానికి, బంగారు భవిష్యత్తుకోసం చదువులో అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా, ఓపికగా దృష్టి పెట్టాలి. పిల్లలు మొక్కుబడిగా చదివి పరీక్షల్లో పాస్ అయ్యి, నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం వెంపర్లాడకూడదు. విద్యతో చక్కటి ప్రతిభ కలిగిన వారిని అనేక బహుళజాతి సంస్థలు తమ కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ వెంటపడుతున్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండే విద్యార్థి జీవితం భవిష్యత్తులో మరలా తిరిగి రావడం కష్టం. విద్యార్థులు ఆట పాటలతో పాటు, చదువులపై కూడా దృష్టి సారించి, అందరి మన్ననలు పొందాలి. తల్లిదండ్రుల, గురువుల ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. సర్వేపల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో ప్రగతిని సాధించిన విధంగా, విద్యా రంగంలో కూడా సాధించాలని, విద్యార్థుల ద్వారా నియోజకవర్గానికి మరింత గుర్తింపు రావాలని ఆశిస్తున్నాం.