బ్రిటిష్ వారికంటే ఘోరంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం


రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను కూడా హరిస్తున్న జగన్మోహన్ రెడ్డి


రమ్య హంతకులను శిక్షించాలని కోరుతూ కోవొత్తుల ర్యాలీ చేయబోతున్న తెలుగుదేశం పార్టీ నేతలను గృహానిర్బంధం చేయడం,అరెస్టులు చేయడం దారుణం

                      ---చేజర్ల◾◾◾◾◾◾◾◾◾◾◾


👉ఇటీవల హత్యకు గురైన రమ్య హంతకులను శిక్షించాలని కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు నెల్లూరు వేదయపాలెం సెంటర్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం వద్ద కోవొత్తుల ర్యాలీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది


👉అయితే పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను, అనుబంధ సంఘాల నాయకులను గృహానిర్బంధం చేయడమే కాకుండా కొంత మంది నాయకులను అరెస్టు చేయడం జరిగింది. దీనిని త్రీవరంగా ఖండిస్తునాం.


👉ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్క పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఉంది.అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రాధమిక హక్కును కూడా హరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉక్కుపాదం మోపుతుంది.


👉గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించివుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసివుండేవారా!


 👉దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటీష్ వారు వ్యవహరించిన తీరుకంటే ఘోరంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది


👉పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజా ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం


👉రాష్ట్రంలో వైసీపీ పాలనలో అడబిడ్డలకు రక్షణ కరువైంది. పోలీసులను తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టులు చేయడానికి,గృహానిర్బంధం చేయడానికి వినియోగించడానికి బదులు అడబిడ్డలను వేధిస్తున్న వారిని దండించడానికి ఉపయోగిస్తే రాష్ట్రంలో రమ్య హత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.


                       ఇట్లు

      చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి