నెల్లూరు టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పై సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు... బూతులు తిట్టడం లో ...గలీజ్ మాటలు మాట్లాడటం లో కాకాని కి సింహపురి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్  ఇవ్వవచ్చని అని ఎద్దేవా చేశారు... సింహపురి యూనివర్సిటీ కి కాకాని వెళ్లి ఏదో చదువుతున్నట్లు నటిస్తుంటాడన్నారు... తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నెల్లూరులో బూతులు తిట్టడంతో కాకానిని మించినవారు ఇంకొకరు ఉండరన్నారు... సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సుదీర్ఘంగా అరగంటసేపు జరగడం విశేషం. ఈ విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు టీడీపీ రజాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవి చంద్ర , నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ , మాజీ నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు