పట్టుబడ్డ అక్రమ  తమిళ మద్యం👈
♦️ఇద్దరు నిందితులను అదుపులోకి👈
♦️ అక్రమ మద్యం నిల్వలు ఉన్న , తరలిస్తున్న కఠిన చర్యలు తప్పవు  - సి ఐ  వెంకటేశ్వర్లు రెడ్డి
చట్ట వ్యతిరేకంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు నొచ్చు కుప్పం  మద్యం దుకాణము నుండి తమిళ
మద్యంను రెండు బ్యాగుల్లో నింపుకొని అపాచీ ద్విచక్రవాహనంపై నెల్లూరుకు తరలి వెళ్తుండగా మార్గమధ్యం సూళ్లూరుపేట జాతీయ రహదారిపై పోలీసు అధికారులు  జరిపిన వాహనాల తనిఖీలలో  పట్టుకున్నట్లు సి ఐ వెంకటేశ్వర్లు రెడ్డి తెలిపారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు విష్ణు సాయి కుమార్ లు తమిళనాడు నుంచి కుప్పం మద్యం దుకాణం నుండి 24 ఆఫ్ లు 3 క్వార్టర్ బాటిల్ రెండు సంచులలో  సర్దుకుని అపాచీ ద్విచక్రవాహనంపై నెల్లూరుకు  వెళుతుండగా మార్గ మధ్యలో సూళ్లూరుపేట జాతీయ రహదారిపై పోలీసులు జరిపిన వాహన తనిఖీలలో వీరు పట్టుబడినట్లు సిఐ వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి  రిమాండ్ కు తరలించడం జరుగుతుందని   అన్నారు.  సమావేశంలో సి.ఐ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ ఐ. కాసుల శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.