ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ గా నెల్లూరుజిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన పేర్నాటి హేమ సుశ్మిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఏపి స్టేట్ సీడ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.