కోట మండలం అల్లంపాడు గ్రామంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా  ఆదివారం

పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా గూడూరు సబ్ కలెక్టర్  రొనంఖి గోపాలకృష్ణ, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు పాల్గున్నారు, ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల కోసం పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అల్లం పాడు గ్రామంలో నాలుగు ఎకరాలు పట్టా భూమి దానం చేయడం అభినందనీయం అన్నారు. 


 డివిజన్ లో 25 వేల మంది పేదలకు ఇంటి నివేశన స్థలాలుపంపిణీచేయడంజరుగుతుందన్నారు.అల్లంపాడు గ్రామం లో నాలుగు ఎకరాల పట్టా భూమిని  పేదల ఇళ్ల స్థలాల కు ఇవ్వడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ శ్యాంప్రసాద్ రెడ్డి నీ సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అభినందించారు., 


 పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆచరిస్తూ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అని  తెలిపారు,ఉన్న ఊరిని కన్న తల్లిని మరవను అనీ వెల్లడించారు. 


 గూడూరు  డిఎస్పి రాజగోపాల్ రెడ్డి  మాట్లాడుతూ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉంటూ కూడా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు అన్నారు, ఈ నేపథ్యంలో  అల్లంపాడు గ్రామంలో పేద ప్రజల కోసం 4 ఎకరాలు భూ దానం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. 


 ఈ కార్యక్రమంలో తహశీల్దార్  రమాదేవి, ఎంపీడీవో భవాని ,వైకాపా నాయకులు దువ్వూరు వెంకటరమణా రెడ్డి  ,దువ్వూరు సాయి కృష్ణారెడ్డి ,పి రాజా రామ్ రెడ్డి ,మల్లం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి , పాదర్తి రాధకృష్ణా రెడ్డి,మాజీ కోట మండల జడ్పిటిసి సభ్యులు  ఉప్పల ప్రసాద్ గౌడ్ ,  వైకాపా నాయకులు ఇన్నమాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్ గౌడ్,వెంకు రెడ్డి,మధు రెడ్డి,సునిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు