ఉదృతంగా ప్రవహిస్తున్న    స్వర్ణముఖి నది  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి   భయబ్రాంతులకు  గురిఅవుతున్న ప్రజలు  స్వర్ణముఖి నది  మెయిన్ రోడ్లు వద్ద పోలీసులు చెక్ పోస్ట్లు :నాయుడుపేట పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. గత మూడు రోజులుగా నివర్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు  జిల్లా అతలాకుతలంగా ఉన్న క్రమంలో నదులు, చెరువులకు జలకళ సంతరించుకుంది. ఇందులో భాగంగానే  నాయుడుపేట స్వర్ణముఖీ నదికి ఐదు సంవత్సరాల తర్వాత నీరు వచ్చి నిండు కుండ వల్లే ఉంది పట్టణ ప్రజలు బ్రిడ్జి వద్దకు చేరుకొని వరదజలాల ఉదృతిని తిలకించారు.ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆర్డీఓ సరోజినీ,    సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరెడ్డి,సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేస్వరరావు,మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, భద్రతా ఏర్పాట్లు చేశారు.