దొంగతనాలను అరికట్టడానికి డివిజన్ పరిధిలోని ప్రజలకు సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలని వేదాయపాలెం సీఐ సుబ్బారావు గారు పేర్కొన్నారు నగరంలోని 35వ డివిజన్ సచివాలయంలో స్థానిక వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకుడు యకసిరి శరత్ చంద్ర తో కలిసి సచివాలయం అడ్మిన్ లకు అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ పోలీస్ సిబ్బందికి వాలంటీర్లకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అంశాల గురించి వివరించారు ఈ సందర్భంగా ప్రజలు  దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం CI  సుబ్బారావు గారు మాట్లాడుతూ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారి వద్ద ఉన్న మొబైల్ నుంచి కరపత్రంలో చూపబడిన నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని తద్వారా ఆ ప్రాంతాన్ని తన సిబ్బంది పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మస్తాన్ పాల్గొన్నారు