ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులకు ఐఎఎస్‍ శ్రీలక్ష్మీ.


అమరావతి


 ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా వైఎస్‍.జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్ర సర్వీసులోకి రావాలని గత సంవత్సరన్నర కాలంగా ప్రయత్నాలు చేసిన మహిళా ఐఎఎస్‍ అధికారి శ్రీలక్ష్మీకి ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.తన కేడర్ను మార్చాలంటూ శ్రీ లక్ష్మి క్యాట్ ను ఆశ్రయించారు , ఏపీ క్యాడర్ కు కేటాయించాలని కోరారు. క్యాట్ అంగీకరించటంతో క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది.  తెలంగాణ ప్రభుత్వం ఆమెను రిలీవ్‍ చేయటంతో ఆమె జిఎడిలో రిపోర్టు చేశారు. రేపో మాపో ఆమెకు ప్రభుత్వం పోస్టింగ్‍ ఇవ్వనుంది. శ్రీలక్ష్మీని ఏ పోస్టులో నియమిస్తారు అనే విషయం బయట పడటం లేదు. చిన్న వయసులో ఐఎఎస్‍ అధికారి శ్రీలక్ష్మీ దివంగత నేత వైఎస్సార్‍ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు