స్పందన భవనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు


నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో నిర్మాణం జరుగుతున్న స్పందన భవనాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు... జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తో కలిసి బుధవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను పరిశీలించారు.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరుగుతుందా లేదా నన్న అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నూతన భవనం లోనే జాయింట్ కలెక్టర్ చాంబర్ తో పాటు స్పందన హాల్, వివిధ చాంబర్ లు ఏర్పాటు చేయనున్నారు