స్నూకర్ క్రీడాభివృద్ధికి కృషి

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ
 స్నూకర్ క్రీడాభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీనిచ్చారు. మద్రాసు బస్టాండ్ సమీపంలోని స్నూకర్ పార్లర్ లో జిల్లాస్థాయి టోర్నమెంట్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నూకర్ చాలా మంచి ఆట అని, ఇటీవల కాలంలో జిల్లాలో అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. నేను జిల్లా స్నూకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, మల్లికార్జున్ కార్యదర్శిగా, ప్రముఖ న్యాయవాది మల్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి  గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. నా చిరకాల మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ కుమారుడు రాహిల్ తాజ్ ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని, భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు జరపాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ కు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. స్నూకర్ టోర్నమెంట్ ఎక్కడ పెట్టినా ఎమ్మెల్యేగా కంటే స్నూకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా సంపూర్ణ సహకారం ఉంటుందని రాహిల్ తాజ్ కు తెలిపారు. టోర్నమెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా టోర్నమెంట్ నిర్వాహకులు రాహిల్ తాజ్ కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్కు స్పాన్సర్ లుగా మనోహర్ రెడ్డి, గోల్డెన్ లైట్స్ విక్రమ్, వైజయంతి ఎలక్ట్రానిక్స్ అధినేత నిరంజన్ రెడ్డి తదితరులు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి వైజయంతి ఎలక్ట్రానిక్స్ అదినేత నిరంజన్ రెడ్డి, తేజ కార్స్ నిర్వాహకులు ఎం.శ్రీనివాస్, మైనారిటీ నేతలు అతహర్ భాయ్, ఫరూక్ భాయ్, రియాజ్ భాయ్, హాజరయ్యారు.