స్కిల్ కాలేజీల ఏర్పాటులో పురోగతిపై సమీక్షించిన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటిఅమరావతి, డిసెంబర్, 17; నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్వహణ, మూలధన వ్యయాల నిధుల సమీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. నైపుణ్య కళాశాలలకు సంబంధించిన కరికులమ్ ఆమోదం సహా కేంద్ర నిధుల సమీకరణ, డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ తదితర అంశాలపై మంత్రి మేకపాటి ప్రధానంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీలకు ఆర్థికపరమైన అంశాలపై ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరామును మంత్రి మేకపాటి  అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఎమ్ఎన్సీ కంపెనీలు, కార్పొరేషన్లతో భాగస్వామ్యమవడం గురించి నైపుణ్యాభివృద్ది శాఖ అధికారులు మంత్రి మేకపాటికి వివరించారు. విజయవాడ ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్,  ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ తదితరులు హజరయ్యారు.