జూదరులపై ఉక్కుపాదం మోపుతున్న  సైదాపురం ఎస్సై ఎం.శివశంకర్


సైదాపురం మం దేవరవేమూరు గ్రామ శివారుల్లో కోడి పందెం స్థావరాలపై దాడులు


 సైదాపురం ఎస్సై ఎం.శివశంకర్ తన సిబ్బంది తో  మండలం లోని దేవరవేమూరు గ్రామ శివారుల్లో కోడిపందెలు వేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుండి 5 పందెం పుంజులు,రెండు సెల్ ఫోన్లు,4,200 రూ నగదుతో పాటు సంఘటన స్థలం లో 4 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు...


తీరు మార్చుకోండి,నిత్యం నిఘా ఉంటుంది  జూదరులకు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి సైదాపురం ఎస్సై హెచ్చరిక


ఇప్పటికే మాధ్యమాల ద్వారా విలేజ్ పోలీసులు ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు కూడా అసాంఘిక కార్యకలాపాలకు,జూదాలకు,మత్తు పదార్థాలుకు దూరంగా ఉండాలని సూచనలు చేశామని ఎవరైనా చట్టవ్యతిరేకమైన పనులు చేసినా,చేయాలని చూసినా పోలీసుల నిఘా  ఎప్పుడూ ఉంటుందని  తప్పుచేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని,చట్టాల అమల్లో రాజీ లేదని ఎస్సై. ఎం. శివశంకర్ తెలియచేసారు...