బాలికను ఇంట్లో బంధించి ఆమెతో అనుచితంగా వ్యవహరించిన సీనియర్‌ డివిజన్‌ సివిల్‌ జడ్జి దీపాలి శర్మను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన గవర్నర్‌ బేబీ రాణి మౌర్య దీపాలి శర్మను సర్వీస్‌ను తొలగించాల్సిందిగా ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంట్లో  పనిచేస్తున్న  బాలికను దీపాలి శర్మ 2018 జనవరిలో బంధించి అనుచితంగా వ్యవహరించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు అదే ఏడాది జనవరి 29న హరిద్వార్‌లోని దీపాలిశర్మ ఇంటిపై దాడి చేసి గాయపడిన స్థితిలో ఉన్న బాలికను గుర్తించి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.  పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం నివేదికను కోర్టుకు అందజేశారు. దీంతో కోర్టు ఆమెను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా బాలికను తాను కన్నబిడ్డలా చూసుకున్నానని,  తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని దీపాలి శర్మ ఖండించారు.