సమగ్ర పరిశ్రమ సర్వే క్రింద, పరిశ్రమల మరియు ఉత్పాదకత యూనిట్లు రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలు కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై ప్రత్యేక డ్రైవ్ చేపట్టుటకై  జాయింట్  కలెక్టర్ ఆసరా శ్రీ వి. కె శీనా నాయక్ జిల్లా పరిశ్రమల పరిరక్షణ సమగ్ర పరిశ్రమ సర్వే క్రింద, పరిశ్రమల మరియు ఉత్పాదకత యూనిట్లు రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలు కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై ప్రత్యేక డ్రైవ్ చేపట్టుటకై పరిశ్రమల పరిరక్షణ కమిటీ  సమావేశాన్ని శ్రీయుత జాయింట్  కలెక్టర్ ఇంచార్జి ఆసరా & వెల్ఫేర్ శ్రీ వి. కె శీనా నాయక్ గారు డి ఆర్ డి ఎ పి. డి ఛాంబర్ నందు నిర్వహించారు.  

ఈ సమావేశానికి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ బోయిలెర్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ మరియు జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల శాఖ వారు హాజరైనారు.