సోమశిల సౌత్ ఫీడర్ కాలువ పరిధి లోని రైతాంగ,మరియు త్రాగునీటి  సమస్యల తక్షణ పరిష్కారం  పై దృష్టి సారించండి :ఆనం సూచన

సోమశిల ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా శ్రీ కృష్ణారావు గారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, నేడు నెల్లూరు నగరంలోని "ఆనం నివాసం వద్ద" మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోమశిల ప్రాజెక్టు సర్కిల్ పరిధిలోని పలు అంశాలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కలువాయి మండల రైతుల ప్రయోజనాల కోసం , త్రాగునీటి పథకాల సౌలభ్యత కోసం నీటి సరఫరా లో చేపట్టాల్సిన పనులలో ఎలాంటి జాప్యం లేకుండా అనుసరించిన కార్యాచరణపై ఆనం రామనారాయణ రెడ్డి గారు సోమశిల ప్రాజెక్టు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.ఈ సమావేశం లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్  తదితరులు పాల్గొన్నారు