కాదలూరు ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు.

 నెల్లూరు జిల్లా.  తడ:- మండలంలోని  కాదలూరు ప్రాథమిక పాఠశాల నందు రాబోయే సంక్రాంతి ని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులకు ముగ్గుల పోటీలు గాలిపటాల తయారీలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది, విద్యార్థుల చేత భోగి మంటలు వేయించి, విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.